ఆ హీరో స్వీట్ పాయసం.. శ్రీలీల కామెంట్స్

by Sujitha Rachapalli |

యంగ్ హీరోయిన్ శ్రీలీల హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో స్టార్ హోదా పొందుతున్న బ్యూటీ.. ఇప్పటికే హిందీ డెబ్యూ మూవీ షూటింగ్ చేస్తుండగా.. తమిళ్ డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది.

ఆ హీరో స్వీట్ పాయసం.. శ్రీలీల కామెంట్స్
X

దిశ, సినిమా : యంగ్ హీరోయిన్ శ్రీలీల హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో స్టార్ హోదా పొందుతున్న బ్యూటీ.. ఇప్పటికే హిందీ డెబ్యూ మూవీ షూటింగ్ చేస్తుండగా.. తమిళ్ డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ‘పరాశక్తి’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శివ కార్తికేయన్, జయం రవి, అథర్వ మురళి కీలకపాత్రలు చేస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఘనంగా నిర్వహించగా.. స్పీచ్ అదరగొట్టేసింది. శివ కార్తికేయన్‌ను పాయసం లాంటి స్వీట్ అని అభివర్ణించిన హీరోయిన్.. ఆయన ఫ్యాన్స్‌తో ఫోటోలు తీసుకుంటుంటే ట్రాఫిక్ ఆగిపోయిందని.. ఎంత పేషెన్స్‌గా ఉంటాడో ఇది ఒక ఉదాహరణగా వివరించింది. ఆయన ఈ సినిమాకు గ్రేటెస్ట్ స్ట్రెంథ్ అని కొనియాడింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీ.వి. ప్రకాష్ గురించి మాట్లాడిన ఆమె.. GV100 మైల్‌స్టోన్ అద్భుతమని.. ఈ సినిమా పూర్తి పవర్ ఆయన మ్యూజిక్‌లో ఉందని హైప్ ఇచ్చింది. కాగా ఈ ఈవెంట్‌లో రవి మోహన్, అథర్వ, సుధా కొంగర, ప్రొడ్యూసర్ ఆకాశ్ భాస్కరన్ ఇతరులు పాల్గొన్నారు.

Next Story