- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో శ్రీలీల అసభ్యకర ఫొటోలు.. వైరల్ పోస్ట్
బ్యూటిఫుల్ శ్రీలీల తెలుగులోనే కాదు బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటకే హిందీ డెబ్యూ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అవకాశాలకు కొదవలేదు. అయితే ఏఐ వినియోగించి తన పిక్చర్స్‌ను అసభ్యంగా మార్చి.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడాన్ని

దిశ, సినిమా : బ్యూటిఫుల్ శ్రీలీల తెలుగులోనే కాదు బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటకే హిందీ డెబ్యూ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అవకాశాలకు కొదవలేదు. అయితే ఏఐ వినియోగించి తన పిక్చర్స్‌ను అసభ్యంగా మార్చి.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడాన్ని తప్పుపట్టింది బ్యూటీ. తన గురించి ఎలాంటి ప్రచారం జరిగినా లైట్ తీసుకుంటానని.. కానీ ఇలాంటి అసభ్యకర ఫొటోలను తయారు చేయడం దారుణమని పోస్ట్ పెట్టింది. ‘ప్రతీ సోషల్ మీడియా యూజర్‌కు చేతులెత్తి మొక్కుతూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏఐ జనరేటెడ్ నాన్సెన్స్‌కు సపోర్ట్ చేయకండి. టెక్నాలజీ యూజింగ్‌కు, అబ్యూజింగ్‌కు మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. సాంకేతికతను లైఫ్‌ను సింపుల్‌గా చేసేందుకు వాడుకోవాలి కానీ కాంప్లికేట్ చేసేందుకు కాదు. షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఆన్‌లైన్‌లో జరిగే విషయాల గురించి నాకు తెలియదు. తన వెల్ విషర్స్ ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. నేను చాలా విషయాలను లైట్ తీసుకుంటా కానీ ఇది డీప్‌గా డిస్టర్బ్ చేసింది. నా కొలిగ్స్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎక్స్‌పీరియన్స్ చేశారని తెలిసింది. వారందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆడియన్స్ మాకు సపోర్ట్ అందించండి. మిగతాది అథారిటీస్ చూసుకుంటారు’ అని కోరింది.






