- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sri Gowri Priya: పట్టు చీరలో ముసిముసి నవ్వులతో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ హీరోయిన్
తాజాగా శ్రీ గౌరీ ప్రియ ఎరుపు రంగులో గోల్డెన్ అంచు కలిగిన అందమైన చీర కట్టుకొని, తన క్యూట్ స్మైల్‌తో చూపరులను ఆకట్టుకుంటోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న యంగ్ బ్యూటీ శ్రీ గౌరీ ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె చాలా కాలం క్రితమే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా, మొదట్లో అనుకున్న స్థాయిలో గుర్తింపును సంపాదించుకోలేకపోయింది.
అయితే అందుకు ప్రధాన కారణం ఈ బ్యూటీ భారీ చిత్రాల్లో నటించినప్పటికీ, అందులో ఈమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడమే. కానీ అలాంటి సమయంలోనే ఈ చిన్నది రైటర్ పద్మభూషణ్ సినిమాలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీతో ఈమెకు మంచి గుర్తింపు రావడం ప్రారంభమైంది.
ఆ తర్వాత తక్కువ కాలంలోనే మ్యాడ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ కావడంతో పాటు, ఇందులో ఈమెకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. దీంతో ఈ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది. సినిమాల్లో ఈ బ్యూటీ ఎక్కువగా గ్లామర్ షో చేయకుండా, తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది.
సోషల్ మీడియాలో కూడా ఈమె ఎక్కువగా క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌లో ఉన్న ఫోటోలనే పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా గౌరీ ప్రియ ఎరుపు రంగులో గోల్డెన్ అంచు కలిగిన అందమైన పట్టు చీర కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ధరించి, చెవులకు పెద్ద కమ్మలు పెట్టుకొని, నుదిటిపై బొట్టు పెట్టుకొని సంప్రదాయబద్ధంగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
అలాగే ఇందులో ఈమె అందంగా జడ వేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జడ ఆమెకి మరింత అందాన్ని తీసుకువచ్చింది. సంప్రదాయ వేషధారణలో చిరునవ్వుతో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలలో గౌరీ ప్రియ ఎంతో అందంగా కనిపించడంతో ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






