హ్యాపీ బర్త్‌డే మై సూపర్ హీరో అంటూ అతనికి విష్ చేసిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫొటోలు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-24 03:47:34  IST  )

యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ శ్రీముఖి(Srimukhi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హ్యాపీ బర్త్‌డే మై సూపర్ హీరో అంటూ అతనికి విష్ చేసిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజెంట్ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుని టాప్ యాంకర్స్‌లో ఒకరుగా దూసుకుపోతుంది. 'పటాస్'(Patas Show) షోతో ప్రారంభమైన తన కెరీయర్‌ను అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్‌తో స్టార్ యాంకర్స్ జాబితాలో చేరిపోయింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ టీవీ ప్రొగ్రామ్స్‌తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరిస్తోంది. బుల్లితెర రాములమ్మగా కూడా గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ టెలివిజన్ రంగంలో సంచనమే సృష్టించిందని చెప్పొచ్చు.

శ్రీముఖి టీవీ షోల్లోనే కాకుండా తన అభిమానులకు సోషల్ మీడియా(Social Media)లోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.అందులో తన నాన్నతో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నా సూపర్ హీరో అయినటువంటి మా డ్యాడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్ యు సో మచ్.. నీ పాప’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు శ్రీముఖి వాళ్ల నాన్నకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

Read More..

PRABHAS: దానికోసం సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నానంటూ ప్రభాస్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే


Next Story