- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sreemukhi: చీరకట్టులో కుర్రాళ్ల గుండెల్ని కుదిపేస్తున్న క్యూటీ యాంకర్
పట్టుచీరలో శ్రీముఖి క్లాస్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు.

దిశ, వెబ్ డెస్క్: నటిగా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. కెరీర్ ప్రారంభంలో నటిగా సినిమాల్లో అవకాశాలు దక్కినా, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఈ బ్యూటీ యాంకరింగ్ వైపు అడుగులు వేసింది.
అయితే అక్కడ మాత్రం శ్రీముఖికి అదిరిపోయే గుర్తింపు దక్కింది. తన చలాకీతనం, మాటతీరు, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో టాప్ యాంకర్లలో ఒకరిగా నిలిచింది. ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ ఎక్కువగా యాంకరింగ్‌పైనే దృష్టి పెడుతూ కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.
మరోవైపు సినిమాల్లో, టీవీ షోలు, ఈవెంట్స్‌లో తన అందంతో ఆకట్టుకునే శ్రీముఖి సోషల్ మీడియాలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌తో పాటు ట్రెడిషనల్ లుక్స్‌లోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో శ్రీముఖి పట్టుచీరలో ఎంతో క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌లో కనిపించింది. అందుకు తగిన అందమైన బ్లౌజ్ ధరించి కెమెరాకు స్టైలిష్ పోజులు ఇచ్చింది. చేతినిండా గాజులు, అందమైన ఉంగరం, పెద్ద ఇయర్ రింగ్స్‌తో పాటు నుదుటిన బొట్టు పెట్టుకుని మరింత ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది.
అలాగే కురులను అందంగా ముడివేసి పూలు అలంకరించుకోవడంతో ఆమె లుక్‌కు మరింత అందం వచ్చింది. మొత్తంగా ఈ ట్రెడిషనల్ అవతార్‌లో శ్రీముఖి ఎంతో ఆకట్టుకుంటుండటంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






