పెళ్లి పీటలెక్కబోతున్న శ్రీముఖి.. వరుడి కోసం వెయిటింగ్ అంటూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

శ్రీముఖి తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను భరించి, చిన్నపిల్లలా నడిపించి మా ‘ఇంటి బంగారం’ మూవీలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకురాలు నందీని రెడ్డి పాదాలకు నమస్కరించారు

పెళ్లి పీటలెక్కబోతున్న శ్రీముఖి.. వరుడి కోసం వెయిటింగ్ అంటూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి.. తన అందం, అభినయంతో పాటుగా మాటతీరుతో ఎంతోమంది అభిమానులకు దక్కించుకున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’ చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్న శ్రీముఖి త్వరలో ‘మా ఇంటి బంగారం’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంతతో పాటు ఆమె భర్త రాజ్ నిడిమోరు, హిమాంక్ నిర్మించారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమ్, శ్రీముఖి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ వేడుకల్లో పాల్గొన్న శ్రీముఖి తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను భరించి, చిన్నపిల్లలా నడిపించి మా ‘ఇంటి బంగారం’ మూవీలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకురాలు నందీని రెడ్డి పాదాలకు నమస్కరించారు. అలాగే రాజ్ నిడిమోరు వర్క్‌కి ఫిదా అయిపోయి ఫ్యాన్ అయ్యానని అన్నారు.

‘మా ఇంటి బంగారం’తో సాక్షాత్తూ మేలిమి బంగారమే వస్తున్నప్పుడు అందరూ బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక సమంత గురించి మాట్లాడుతూ.. చాలా మంది ఒక స్థాయికి చేరుకున్నాక రిలాక్స్ అవుతారని కానీ సమంత మాత్రం నిత్యం ఆకలితో ఉంటారని అన్నారు. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలను సమంత ఇన్‌స్పైర్ చేస్తుంటారని చెప్పారు. సమంత మీద తనకెంతో ప్రేమ ఉందని.. తన గురించి చాలా చెప్పాలని అన్నారు. అయితే 15 సంవత్సరాల ఇండస్ట్రీ జర్నీ అంతా ఒకెత్తు అయితే.. ఇక స్టార్ట్‌డమ్ ఒకెత్తు అని పేర్కొన్నారు. ఇక తన పెళ్లి గురించి కూడా హింట్ ఇచ్చారు శ్రీముఖి. ఈ వేళా విశేషంతో పెళ్లి కూడా జరిగిపోవాలని కోరుకుంటున్నట్లు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక యాంకర్‌గా వ్యవహరించిన సుమ.. శ్రీముఖి.. నీ పెళ్లి ఎప్పుడు అంటే ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ తర్వాత అన్నావ్.. మరి అన్నీ రెడీగా ఉన్నయ్ పెళ్లి కొడుకు దొరికితే పెళ్లి జరిగిపోతుందని అన్నారు. దీంతో శ్రీముఖి తాను కూడా ఆయన కోసమే వెయిటింగ్ అనడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం శ్రీముఖి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story