Sreeleela: శ్రీలీల అప్‌కమింగ్ మూవీస్.. లిస్ట్ చూసి ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-08-26 10:56:00  IST  )

యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది.

Sreeleela: శ్రీలీల అప్‌కమింగ్ మూవీస్.. లిస్ట్ చూసి ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. గతంలో కాస్త డౌన్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. మళ్లీ ఇప్పుడు లైన్‌లోకి వచ్చిన శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో ఈ అమ్మడు ఏకంగా నాలుగు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది.

అందులో తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర (Mass Jathara) ఒకటి. ఆగస్టు 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా పడినట్లు చిత్ర బృందం రీసెంట్‌గా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఇక కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పాటు తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌(Ustad Bhagat Singh)లో నటిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రొగస్‌లో ఉంది. ఈ మూవీతో పాటు హిందీలో ఆషికి-త్రీ (Aashiqui-3)లో హీరోయిన్‌గా సెలక్ట్ అయింది శ్రీలీల. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో ఈ డ్యాన్సింగ్ క్వీన్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయింది. ఇక తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి మూవీతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇలా అన్ని భాషలను కవర్ చేస్తూ ఫుల్ స్వింగ్‌లో శ్రీలీల దూసుకుపోతుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story