Sreeleela: అవన్నీ రూమర్స్ మాత్రమే.. దయచేసి వాటిని నమ్మకండి.. శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-13 06:53:50  IST  )

‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Sreeleela: అవన్నీ రూమర్స్ మాత్రమే.. దయచేసి వాటిని నమ్మకండి.. శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీ, కార్తీక్ ఆర్యన్(Kartik Aryan) సరసన ‘ఆషికీ-3’(Aashiqui-3), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. అయితే రీసెంట్‌గా విడుదలైన ‘సైయారా’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ ఆల్జిమర్‌ వ్యాధితో బాధపడుతుంటుంది.

అక్కడ్నుంచే కథ మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న ‘ఆషికీ 3’ కథ కూడా దాదాపు ఈ తరహాలోనే సాగుతుందని ఓ రూమర్ నెట్టింట షికార్లు చేస్తుంది. అలా గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లపై ఎట్టకేలకు శ్రీలీల స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది మాట్లాడుతూ.. “సైయారా’కూ మా సినిమాకూ ఏ సంబంధమూ లేదు. కథానుగుణంగా ఇందులో నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అవన్నీ రూమర్లు. దయచేసి వాటిని నమ్మకండి’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీలీల. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story