- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు చెప్పిన శ్రీలీల.. ఎందుకంటే..?
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ పెళ్లి సందడి (Peḷli sandaḍi) మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్‌లో మంచి అవకాశాలు దక్కించుకుంది. అతితక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు సొంతం చేసుకుంది. ఏకంగా టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోల సరసన అవకాశాలు సంపాదించుకుని ఫుల్ పాపులర్ అయ్యింది.
ఏకంగా బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి సీనియర్ కథానయకుల హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి.. మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ ప్రముఖ నటీమణులకే గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Iconstar Allu Arjun) హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వం వహించిన వరల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప రెండో భాగంలో ఐటెమ్ సాంగ్‌లో గ్లామర్ స్టెప్పులు వేసి నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇక శ్రీలీల గుంటూరు కారం (Guntur Karam), ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి (Bhagwant Kesari), ధమాకా, వంటి తెలుగు చిత్రాల్లో నటించి జనాల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ కుర్ర హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెగాస్టార్ చిరంజీవితో దిగిన సెల్ఫీ ఫొటోలు పంచుకుంది. అలాగే ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఉప్మా అండ్ దోసలు.. అన్‌లిమిటెడ్ ఫుడ్ అందించినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది. శ్రీలీల ఫుడ్ అందుకుంటోన్న పిక్స్ అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
READ MORE ...
'విశ్వంభర' రిలీజ్ డేట్ ఫిక్స్..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్






