బ్లాక్ డ్రెస్‌లో శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్.. నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోన్న వీడియో

by Kodari Anjali |

కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల.

బ్లాక్ డ్రెస్‌లో శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్.. నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోన్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ మొదట్లో చిన్న చిన్న హీరోల సరసన నటించింది. వెంటనే ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన అవకాశం కొట్టేసింది. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు దక్కాయి. ఈ అమ్మడు అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశయోక్తిలేదు. కాగా శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకులు పోటీ పడ్డారు. టాలీవుడ్ మొదట్లోనే వరుస సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేసింది. సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టింది. ఇకపోతే శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిగత విషయాల్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సెన్సేషనల్ బ్యూటీ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా ఈ సెన్సేషనల్ బ్యూటీ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. శ్రీలీల నటిస్తోన్న లేటెస్ట్ సినిమా జూనియర్ నుంచి ‘వైరల్ వయ్యారి’ సాంగ్ విడుదల అయ్యింది. వై వై వయ్యారి అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో ఈ సెన్సేషనల్ ముద్దుగుమ్మ అదిరిపోయే స్టెప్పులేసి కుర్రవాళ్లను కట్టిపడేసింది. అయితే ఈ హీరోయిన్ సాంగ్ మీద బ్లాక్ టీషర్ట్ ధరించి డ్యాన్స్ అదరగొట్టింది. అలాగే వైరల్ వయ్యారి ఇప్పుడు విడుదలైందని పోస్టులో రాసుకొచ్చింది. 72 గంటలు నిద్ర లేకుండా గడిపిన ఈ పాట నన్ను ఉత్సాహపరిచిందని వెల్లడించింది. రిహార్సల్స్ పోస్ట్ చేయను కాబట్టి ఇది కొంచెం సేపటిలో మాయమైపోతే ఆశ్చర్యపోకండని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Next Story