- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
sreeleela: స్టార్ హీరో కొడుకుపై ఉన్న ప్రేమను వెల్లడించిన శ్రీలీల.. షాక్‌లో నెటిజన్లు! (పోస్ట్)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘ధమాకా’(Dhamaka) సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘ధమాకా’(Dhamaka) సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అంతా పాపులారిటీ దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. అతి తక్కువ సమయంలో ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే శ్రీలీలకు వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో కోలుకేలేని దెబ్బ తగిలినట్లు అయింది. దీంతో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుంచి కూడా తొలగించేశారు. ఇక ఏం చేయాలో తెలయక శ్రీలీల పలు యాడ్స్ చేసింది.
అలాగే డాక్టర్ చదువును కొనసాగించింది. మళ్లీ ఇటీవల ‘పుష్ప-2’ మూవీలో కిస్సిక్ సాంగ్ చేసి తన డ్యాన్స్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ పాటతో శ్రీలీల ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం శ్రీలీల మాస్ జాతర, అషికి-3, పరాశక్తి, రాబిన్ హుడ్(Robin Hood) సినిమాల్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan), స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీఖాన్ సరసన నటించనుంది. అయితే ఈ అమ్మడు త్వరలోనే ‘రాబిన్‌హుడ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 28న థియేటర్స్‌లోకి రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యంగ్ హీరోపై ఉన్న ప్రేమను వెల్లడించింది. నేడు ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘హ్యాపీ బర్త్ డే ఇగ్గీ. నువ్వు ప్రపంచానికి ఏం చూపించాలనుకుంటున్నావో దాని గురించి వెయిట్ చేయలేకపోతున్నాను. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే’’ అని హార్ట్స్ సింబల్‌ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం శ్రీలీల నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.






