- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు నిమిషాల సాంగ్ కు రూ.5 కోట్లు..హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా ?
వరుస సినిమాలతో దూసుకెళుతోన్న హీరోయిన్ శ్రీ లీల మరో ఐటెం సాంగ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. తెలుగులోనే సీనియర్ హీరో సినిమాలో చిందులు వేయనున్నారట.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది. 2021లో పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార... ధమాకా సినిమాతోనే హిట్ అందుకుంది. ఈ సినిమాలో రవితేజ తో కలిసి మెరిసిన శ్రీ లీల, అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్ శ్రీ లీల వెనక్కి చూసుకోలేదు.
ఒకేసారి అర డజన్ కు పైగా హీరోయిన్ శ్రీ లీల చేతిలోకి సినిమాలు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. నందమూరి బాలయ్యతో భగవంత్ కేసరి చేసిన హీరోయిన్ శ్రీ లీల, మహేష్ బాబు చేసిన గుంటూరు కారంలో కూడా మెయిన్ హీరోయిన్ రోల్ చేసింది. పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ ను పక్కకు నెట్టి ఛాన్స్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీ లీల హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.
మరో ఐటెం సాంగ్ కు శ్రీలీల రెడీ..?
వరుస సినిమాలతో దూసుకెళుతోన్న హీరోయిన్ శ్రీ లీల మరో ఐటెం సాంగ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. తెలుగులోనే సీనియర్ హీరో సినిమాలో చిందులు వేయనున్నారట. ఇక ఈ పాట కోసం రూ.5 కోట్లు వసూలు చేయనున్నారని సమాచారం. ఈ మేరకు న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేసింది శ్రీ లీల. ఇక అటు తాజాగా నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీకి శ్రీ లీల వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ స్టేజ్ పైన మాట్లాడిన హీరోయిన్ శ్రీ లీల, మీతో మాట్లాడి మాట్లాడి అలసిపోయానని పేర్కొంది. అయితే వెంటనే డ్యాన్స్ చెయ్ అంటూ అక్కడే ఉన్న ఓ స్టూడెంట్ గట్టిగా అరుస్తాడు. దీంతో షాక్ అయిన శ్రీ లీల, పెళ్లాన్ని పిలిచినట్లు పిలుస్తున్నావని ఫైర్ అయిన వీడియో వైరల్ అవుతోంది.






