Sreeleela: వెయిట్ చేయలేనంటూ సెన్సేషనల్ హీరోయిన్ పోస్ట్.. నెటిజన్లలో ఆసక్తిని పెంచుతోన్న వీడియో..?

by Kodari Anjali |

టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Tollywood Sensational Heroine Srileela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Sreeleela: వెయిట్ చేయలేనంటూ సెన్సేషనల్ హీరోయిన్ పోస్ట్.. నెటిజన్లలో ఆసక్తిని పెంచుతోన్న వీడియో..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Tollywood Sensational Heroine Srileela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ఏకంగా సీనియర్ హీరోల సరసన చాన్స్‌లు కొట్టేసి.. అతితక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

ఏకంగా బాలయ్య(Balayya), మాస్ మహారాజా రవితేజ (Mass. Maharaja Ravi Teja) వంటి హీరోల సరసన నటించి.. టాలీవుడ్ సీనియర్ కథానాయికలకే గట్టి పోటీ ఇచ్చింది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2 (Pushpa)సినిమాలో కిస్సిక్ అనే ఐటెమ్ సాంగ్‌(Item Song)కు అదిరిపోయే గ్లామర్ స్టెప్పులు వేసి.. కుర్రాళ్లకు చెమటలు పట్టించింది.

ఇక ఈ బ్యూటీ పెళ్లి సందడి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంత చిన్న వయస్సులో ఇంత గుర్తింపు దక్కించుకుందంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. పెళ్లి సందడి మూవీ తర్వాత ఈ బ్యూటీ ధమకా, భగవంత్ కేసరి(Bhagwant Kesari), ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra ordinary man), గుంటూరు కారం(Guṇṭuru karam), వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తుంది.

ఇకపోతే హీరో సిద్ధార్థ్ (Siddharth) అండ్ శ్రీ గణేష్(Shri Ganesh) కలయికలో ఓ మూవీ రాబోతుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ టీజర్ విడుదల చేశారు. కాగా తాజాగా శ్రీలీల ఈ మూవీపై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘‘బ్యూటిఫుల్ స్టోరీకి బెస్ట్ విషెష్ చెబుతూ.. వెయిట్ చేయలేకపోతున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. ఈ మూవీ టీజర్ వీడియో కూడా జోడించింది. దీంతో నెటిజన్లకు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

Next Story