sreeleela: ‘ఈ నెలను మే అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడే అర్థమైంది’.. అంటూ కుర్ర హీరోయిన్ క్రేజీ పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-05-27 10:48:47  IST  )

కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల.

sreeleela: ‘ఈ నెలను మే అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడే అర్థమైంది’.. అంటూ కుర్ర హీరోయిన్ క్రేజీ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ మొదట్లో చిన్న చిన్న హీరోల సరసన నటించింది. వెంటనే ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన అవకాశం కొట్టేసింది. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు దక్కాయి.

ఈ అమ్మడు అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇరగదీసే డ్యాన్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశయోక్తిలేదు. కాగా శ్రీలీలను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు పోటీపడ్డారు. తెలుగులో మొదట్లోనే వరుస సినిమాలతో టాలీవుడ్ షేక్ చేసింది. సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించింది. ఇకపోతే శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. నెటిజన్లను ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వృత్తిపర విషయాలు ఇలా ప్రతిదీ శ్రీలీల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వారికి టచ్‌లో ఉంటుంది. అయితే తాజాగా ఈ కుర్ర హీరోయిన్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. కొన్ని ఆకట్టుకునే పిక్స్ షేర్ చేసి.. ‘‘ఈ నెలను మే అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడే అర్థమైంది. వర్షం పడవచ్చు.. వేడిగా ఉండకపోవచ్చు .. నిజాయితీగా చెప్పాలంటే ఎందుకు కాదు’’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా జోడించింది.

Next Story
null