Sreeleela: శ్రీలీల పోస్ట్‌తో పాప ఎవరో తెలిసిపోయింది.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

by Kodari Anjali |

టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Sreeleela: శ్రీలీల పోస్ట్‌తో పాప ఎవరో తెలిసిపోయింది.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది. అయితే రీసెంట్ గా ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఓ పాపతో ఉన్న ఫొటోలు పంచుకుంది.

దీంతో ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు పాప ఎవరు అంటూ ఆ రోజు నుంచి తెగ కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. అలాగే శ్రీలీల దివ్యాంగులైన ఇద్దరు చిన్నారులను కూడా దత్తత తీసుకుని పెంచుకుంటోన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరో పాపతో ఉన్న ఫొటో పెట్టింది. తాజాగా ఈ బుజ్జాయి ఎవరో క్లారిటీ ఇస్తూ తాజాగా మరో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. తాజా పోస్ట్‌లో ఈ పాప శ్రీలల సిస్టర్ కూమార్తె అని వెల్లడించింది.

ఈ చిన్నారి రాకతో ఇంట్లో కళ వచ్చిందని , మరింత జోష్ నింపిందని చెప్పింది. ప్రస్తుతం శ్రీలీల పోస్ట్‌తో నెటిజన్లు క్లారిటీకి వచ్చారు. ఇకపోతే శ్రీలీల రీసెంట్‌గానే రాబిన్ హుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. మరిన్ని సినిమాలకు కూడా ఈ సెన్సేషనల్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Next Story