Sreeleela: ‘ఖచ్చితంగా మీ లీలపై మాత్రమే దృష్టి పెట్టండి’.. ఆకట్టుకుంటోన్న శ్రీలీల పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-04-11 14:29:43  IST  )

కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల (Sreeleela).

Sreeleela: ‘ఖచ్చితంగా మీ లీలపై మాత్రమే దృష్టి పెట్టండి’.. ఆకట్టుకుంటోన్న శ్రీలీల పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల (Sreeleela). ఈ బ్యూటీ మొదట్లో చిన్న చిన్న హీరోల సరసన నటించింది. వెంటనే ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) సరసన అవకాశం కొట్టేసింది. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు దక్కాయి.

ఈ అమ్మడు అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశయోక్తిలేదు. కాగా శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకులు పోటీ పడ్డారు. టాలీవుడ్ మొదట్లోనే వరుస సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేసింది. సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టింది.

ఇకపోతే శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సేషనల్ బ్యూటీ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. తన అమ్మతో ఉన్న పలు ఫొటోలు పంచుకుంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘కొత్త అలవాట్లను పెంపొందించుకోవడానికి మీరు చాలా మిస్ అయ్యారు. టైమర్ చిత్రాల మాదిరిగా అని తెలిపింది.

అలాగే చివరి స్లయిడ్ టైమర్ 3సెకండ్లు లేదా 5సెకండ్లు కావాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొదటి స్లయిడ్ ఖచ్చితంగా మీ లీలపై మాత్రమే దృష్టి పెట్టండి’’ అంటూ డిఫరెంట్ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story