Sreeleela:‘నీ కోసం అమృతం’ అంటూ టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-02-23 13:31:17  IST  )

టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Sreeleela:‘నీ కోసం అమృతం’ అంటూ టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఏకంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే సీనియర్ హీరోల సరసన చాన్స్‌లు కొట్టేసి.. అతితక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి కథానాయకుల సరసన అద్భుతంగా నటించి మెప్పించింది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లకు సైతం గట్టీ పోటీ ఇచ్చింది. చివరగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 లో ఐటెమ్ సాంగ్‌లో గ్లామర్ స్టెప్పులేసి యువతను ఆకట్టుకుంది.

వీటితో పాటు ఈ బ్యూటీ ధమకా,పెళ్లి సందడి, భగవంత్ కేసరి, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ఓ ముద్ర వేసుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో వరుస పోస్టులతో జనాల్ని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సెన్సేషనల్ హీరోయిన్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. స్మైలింగ్ ఫేస్‌తో ఉన్న ఓ ఫొటో పంచుకుని..‘‘ కోసం అమృతం ’’ అంటూ ఓ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం శ్రీలీల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story