Sreeleela: మరోసారి ఐటెమ్ సాంగ్‌లో మెరవనున్న శ్రీలీల.. ఏ హీరో సినిమాలో అంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-05-03 15:04:53  IST  )

యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది.

Sreeleela: మరోసారి ఐటెమ్ సాంగ్‌లో మెరవనున్న శ్రీలీల.. ఏ హీరో సినిమాలో అంటే?
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. రీసెంట్‌గా నితిన్ ‘రాబిన్ హుడ్’ (Robin Hood) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. త్వరలో ‘మాస్ జాతర’ చిత్రంతో పలకరించబోతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తు్న్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మే 9 థియేటర్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. సినిమాల పరంగానే కాకుండా.. డ్యాన్స్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతే కాకుండా.. గతేడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప-2’ (Pushpa-2)లో కిసిక్‌లో సాంగ్‌లో స్టెప్పులు వేసి.. మూవీకి ప్లెస్ పాయింట్‌గా నిలిచింది ఈ బ్యూటీ.

ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi). ‘ఉప్పెన్’ ఫేమ్ బుచ్చిబాబు సనా (Buchibabu Sana) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ లెవల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌(Special song)లో శ్రీలీల స్టెప్పులు వేయబోతుందంటూ వస్తున్న వార్తలు ‘పెద్ది’ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ.. చర్రీ ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story