- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీలీలకు ఘోర అవమానం.. పిలిచి మరీ ఇలా చేయడం దారుణమంటూ సీఎం భార్యపై ఫైర్ అవుతున్న అభిమానులు
అమృతా ఫడణవీస్ పక్కనే నిల్చున్న శ్రీలీలను ఉద్దేశించి చాలా అగౌరవంగా చేతి వేలితో సైగ చేస్తూ పక్కకు వెళ్లాలని చెప్పారు.

దిశ, సినిమా: టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు ఘోర అవమానం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులోనే టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, స్టార్ హీరోయిన్ శ్రీలీలకు ఈ వేడుకలో ఘోర అవమానం జరిగింది. ‘దివ్యాజ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన ఈ మెగా యోగా ఈవెంట్‌కు శ్రీలీల గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ వేడుకలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా ఫడణవీస్, ఆమె కుమార్తె దివిజ ఫడణవీస్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఒక ఊహించని సంఘటన జరిగింది. స్టేజ్ పైన ఉన్న సెలబ్రిటీల ఫొటోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ముందుకు వచ్చారు.
మొదట అమృతా ఫడణవీస్, ఆమె కూతురు, అలాగే శ్రీలీల ముగ్గురూ కలిసి కెమెరాలకు నవ్వుతూ చక్కగా పోజులిచ్చారు. అయితే ఆ వెంటనే, అక్కడున్న కొందరు జర్నలిస్టులు అమృతా ఫడణవీస్, ఆమె కూతురిని మాత్రమే విడిగా ఫొటో ఇవ్వాలని కోరారు. దీంతో అమృతా ఫడణవీస్ పక్కనే నిల్చున్న శ్రీలీలను ఉద్దేశించి చాలా అగౌరవంగా చేతి వేలితో సైగ చేస్తూ పక్కకు వెళ్లాలని చెప్పారు. అమృత అలా వేలు చూపించి మాట్లాడటంతో శ్రీలీల ఒక్కసారిగా షాక్ అయి.. అసౌకర్యానికి గురయ్యారు. అయినప్పటికీ, ఆమె ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా చాలా హుందాగా అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీలీల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ హీరోయిన్‌ను అంత పెద్ద వేదికపైకి పిలిచి, అలా వేలు చూపించి పక్కకు పొమ్మనడం అమృతా ఫడణవీస్ దారుణం అంటూ మండిపడుతున్నారు.






