- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైజాగ్ లో టాలీవుడ్ హీరోయిన్.. ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ మరీ !
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీలకు (Sreeleela) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీలకు (Sreeleela) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీ లీల... రవితేజ, ప్రిన్స్ మహేష్ బాబు, హీరో నితిన్ లాంటి బడా స్టార్ హీరోలతో... సినిమాలు చేశారు. మరి కొన్ని సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇటు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది.
ఇలా అవకాశాలు ఎక్కడ అవకాశాలు వచ్చినా.. సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. సినిమా విఫలమైన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈ అందాల తార శ్రీ లీల. అయితే అలాంటి హీరోయిన్ శ్రీ లీల తాజాగా విశాఖలో (Vizag) సందడి చేశారు. విశాఖ నగరంలోని జగదాంబ కూడలిలో... ఇవాళ ఓ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. హీరోయిన్ శ్రీ లీల చేతుల మీదుగా... ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయించారు.
ఈ సందర్భంగా పట్టుచీరలో... హీరోయిన్ శ్రీ లీల మెరిశారు. అంతేకాదు ఈ సందర్భంగా పలు డిజైనర్ వస్త్రాలతో పాటు అగ్గిపెట్ట పట్టుచీరను కూడా... హీరోయిన్ శ్రీ లీల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన అభిమానులకు... ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చారు. విశాఖ నగరానికి రావడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన జీవితంలో అగ్గిపెట్ట పట్టుచీరను ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తానని.. పేర్కొన్నారు.






