- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ షూటింగ్ అప్డేట్.. ఆ స్పీడ్ ఏంటి బాబు
శ్రీ విష్ణు - రామ్ అబ్బరాజు కాంబోలో రూపొందుతున్న సినిమా మూడవ షెడ్యూల్ తాజాగా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత వేగంగా సినిమాలను పూర్తిచేస్తున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకరిగా నిలుస్తున్నారు. ఇటీవల కేవలం వారం వ్యవధిలోనే ‘విష్ణు విన్యాసం’, ‘మృత్యుంజయ్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆ సినిమాలతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. అలాగే కొంతకాలం క్రితం విడుదలైన ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయినప్పటికీ శ్రీ విష్ణు మాత్రం తన స్పీడ్ ఏమాత్రం తగ్గించకుండా వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం ‘సామజవరగమన’ సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరో సినిమా చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. షూటింగ్ వేగాన్ని చూస్తుంటే ఈ సినిమాను కూడా చాలా త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు పని వేగాన్ని చూసి సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇలా ప్రతి హీరో వరుస సినిమాలను వేగంగా పూర్తి చేస్తే ఇండస్ట్రీ మరింత కళకళలాడుతుంది” అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రానికి భాను బోగవరపు, నందు సావిరిగణ కథ అందించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.






