- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sree leela: ఆ సినిమాలో జాన్వీకపూర్ ప్లేస్‌లోకి శ్రీలీల.. ట్వీట్ వైరల్ కావడంతో షాక్‌లో ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దోస్తానా 2’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దోస్తానా 2’. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదట కార్తీక్ ఆర్యన్‌ను హీరోగా ఫిక్స్ చేయగా.. కొన్ని అనివార్య కారణాల చేత అతడు తప్పుకున్నాడు. దీంతో విక్రాంత్ మాస్సేను ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ చేశారు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హీరోయిన్ విషయంలో కూడా మార్పులు జరిగినట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఉన్న టైమ్‌లో ‘దోస్తానా 2’లో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈమె ప్లేస్‌లో శ్రీలీలను రీప్లేస్ చేసినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. ఈ సినిమా షూటింగ్‌లో కూడా శ్రీలీల జాయిన్ అయినట్లు వార్తలు వస్తుండగా.. బాలీవుడ్ ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు. కాగా.. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లింక్






