- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sravana Sandhya: అల్లు అర్జున్ ముఖం మీదే అలా అన్నారు.. నటి షాకింగ్ కామెంట్స్
'గమ్యం' మూవీలో తన నటన చూసి అల్లు అర్జున్ తనను ప్రశంసించారని శ్రావణ సంధ్య చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రావణ సంధ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. శ్రావణ సంధ్య మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. మోడలింగ్‌తో పాటు డాన్సర్‌గా, నటిగా కూడా పనిచేశాను. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో ప్రకటనల్లో కూడా నటించేదాన్ని. అలా కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ గారితో కలిసి '7 అప్' ప్రకటన షూటింగ్ కోసం ముంబైకి వెళ్లాను. అప్పట్లో నేను కాస్త డస్కీ స్కిన్‌తో ఉండేదాన్ని. ఆయన సరదాగా నన్ను ఆటపట్టించేవారు. ఒకసారి ఇంతకుముందు ఏ సినిమాలో నటించావని అడిగారు.
నేను గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్ర చేశానని, షూటింగ్‌లు లేని సమయంలో ప్రకటనలు కూడా చేస్తుంటానని చెప్పాను. వెంటనే ఆయన 'మీరు గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్ర చేశారా?' అని ఆశ్చర్యంగా అడిగారు. నేను 'అవును సార్' అని చెప్పగానే.. 'ఒక విషయం చెబుతాను, ఏమీ అనుకోకండి. నేను ఆ సినిమా చూసినప్పుడు నిజంగానే ఓ నక్సలైట్‌ను తీసుకొచ్చి నటింపజేశారా అని అనుకున్నాను. అంత సహజంగా మీరు ఆ పాత్రలో జీవించారు' అని అన్నారు. అంత గొప్ప నటుడు నా నటనను మెచ్చుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు ఇప్పటికీ మర్చిపోలేను" అని శ్రావణ సంధ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.






