యానిమల్ తేదీన స్పిరిట్?

by Pulgam srinivas |

స్పిరిట్ చిత్రాన్ని 2027 డిసెంబర్ 1న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

యానిమల్ తేదీన స్పిరిట్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2898 AD పార్ట్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ మూడు చిత్రాల షూటింగుల్లో ఏకకాలంలో పాల్గొంటుండటంతో ఒక సినిమా షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకుంటే మిగతా రెండు సినిమాల షెడ్యూల్స్‌పై కూడా దాని ప్రభావం పడుతోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు అనుగుణంగా కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగడం లేదని, దాంతో ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడం కాస్త కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో సందీప్ వంగా తనకు బాగా కలిసి వచ్చిన ఓ డేట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయగా, ఆ సినిమా 900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ ఫార్ములాను దృష్టిలో పెట్టుకొని స్పిరిట్ విషయంలో కూడా అదే డేట్‌ను లాక్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా మార్చిలో విడుదల కాకపోతే వచ్చే ఏడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారని సమాచారం. ఏదేమైనా ప్రస్తుతం స్పిరిట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story