‘స్పిరిట్’ రిలీజ్ డేట్.. వంగా మాస్ అంటున్న రెబల్ ఫ్యాన్స్

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-16 13:07:46  IST  )

‘యానిమల్’ సక్సెస్ తర్వాత ‘స్పిరిట్’ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

‘స్పిరిట్’ రిలీజ్ డేట్.. వంగా మాస్ అంటున్న రెబల్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా : ‘యానిమల్’ సక్సెస్ తర్వాత ‘స్పిరిట్’ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ జనవరి 1న రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో తుఫాన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరో అప్డేట్ ఇచ్చాడు వంగా. మార్చి 5, 2027లో మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్రిప్తి డిమ్రీ, కాంచన, ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై వంగ నిర్మిస్తున్న సినిమాను గుల్షన్ కుమార్, టీ సిరీస్ ప్రజెంట్ చేస్తుంది. కాగా ఈ సినిమాను మొత్తం ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ పోస్ట్‌తో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఏడాది తర్వాత రిలీజ్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే అనౌన్స్ చేయడంతో.. వంగా మాస్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అవుట్ పుట్ అదిరిపోవాలని కోరుతున్నారు. కాగా తాజాగా వచ్చిన ప్రభాస్ ‘రాజాసాబ్’ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story