స్పిరిట్ నుంచి బిగ్ అప్డేట్..ఏకంగా 200 మందితో ప్ర‌భాస్ ఫైట్ ?

by velandi.Saikiran |

200 మందితో ప్రభాస్ ఫైట్ సీన్ ఉంటుందట. ఈ షూట్ జరిపేందుకు ప్రత్యేకంగా సెట్ వేస్తున్నట్లు

స్పిరిట్ నుంచి బిగ్ అప్డేట్..ఏకంగా 200 మందితో ప్ర‌భాస్ ఫైట్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ స్పిరిట్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో వెంటనే స్పిరిట్ మూవీని గాడిలో పెట్టాడు ప్రభాస్. ఇటీవల ఈ స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న నేపథ్యంలో హీరోయిన్ గా తృప్తి డిమ్రి మెరువనున్నారు. వివేక్ ఒబెరాయ్ , ప్రకాష్ రాజు లాంటి వాళ్లు కూడా ఇందులో ఉన్నారట. అయితే ఈ స్పిరిట్ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

డిసెంబర్ మూడో వారంలో హైదరాబాద్ లో స్పిరిట్ కు సంబంధించిన ఓ యాక్షన్ సీన్ షూట్ జరగనుందట. ఈ సందర్భంగా దాదాపు 200 మందితో ప్రభాస్ ఫైట్ సీన్ ఉంటుందట. ఈ షూట్ జరిపేందుకు ప్రత్యేకంగా సెట్ వేస్తున్నట్లు సమాచారం. స్పిరిట్ సినిమాలో ఈ ఒక్క సీన్ గూస్ బంప్స్ తీసుకొస్తుందని టాక్ నడుస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ తో ఉన్న సీన్లకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ డిసెంబర్ లో ఫినిష్ చేయబోతున్నారట సందీప్.

Next Story