స్పిరిట్ స్టోరీ లీక్...ఈ క‌థ వింటే గూస్ బంప్స్ రావాల్సిందే !

by velandi.Saikiran |

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, డాన్ లీ, కాంచన, వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. జైల‌ర్ పాత్ర‌లో

స్పిరిట్ స్టోరీ లీక్...ఈ క‌థ వింటే గూస్ బంప్స్ రావాల్సిందే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారు ఉండరు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఛ‌త్రపతి, బాహుబలి లాంటి సినిమాలు చేసి, ప్రపంచ స్థాయి హీరోగా మార్క్ వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, డాన్ లీ, కాంచన, వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. జైల‌ర్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌నున్నార‌ట‌. అటు ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా తృప్తి డిమ్రి ( Tripti Dimri) మెరుస్తున్నారు. శర వేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. 2026 చివర్ లో లేదా 2027 లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్ ఓ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు రోల్‌ లీక్ అయింది.

లేటెస్ట్ గా దీనిపై మరో న్యూస్ వైరల్ గా మారింది. స్పిరిట్ సినిమా ప్రధానంగా జాతీయ భద్రత సమస్యపై తీసారట. కంప్లీట్‌ దేశభక్తి యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. దేశానికి ప్రాతినిధ్యం వహించే ఓ నిజాయితీ పోలీస్ అధికారిగా స్పిరిట్ లో ప్రభాస్ కనిపిస్తారట. అలాగే పవర్ ఫుల్ రోల్ లో ఉంటారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశ భద్రతకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అడుగడుగునా ప్రభాస్ అడ్డుకుంటారట. ఇలా దేశ భద్రత చుట్టే ఈ సినిమా కథ నడుస్తుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే విల‌న్స్‌, ప్ర‌భాస్ మ‌ధ్య‌ చాలా గూస్ బంప్స్‌ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Next Story