వారణాసి నుంచి స్పెషల్ వీడియో.. అభిమానులకు ఒక్క ఈవెంట్లోనే 5 సర్‌ప్రైజ్‌లు ఇచ్చిన రాజమౌళి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-23 15:48:05  IST  )

వారణాసి పేరుతో టైటిల్ గ్లింప్స్, మహేశ్ లుక్ ను జక్కన్న విడుదల చేయగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

వారణాసి నుంచి స్పెషల్ వీడియో.. అభిమానులకు ఒక్క ఈవెంట్లోనే 5 సర్‌ప్రైజ్‌లు ఇచ్చిన రాజమౌళి
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో #SSMB29వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ ను శనివారం సాయంత్రం #GlobeTrottereventలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వారణాసి పేరుతో టైటిల్ గ్లింప్స్, మహేశ్ లుక్ ను జక్కన్న విడుదల చేయగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో వీడియో విడుదలవ్వగా.. ఆ వీడియో చూసిన అభిమానులు గూస్ బంప్స్ తెప్పిస్తోందని, 2027 వరకూ ఆగలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రుద్రగా కనిపించిన మహేశ్.. నంది వాహనంపై కూర్చున్న లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఉగ్రరూపంలో ఉన్న మహేశ్ ను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈవెంట్ లో టైటిల్, మహేష్ లుక్, క్యారెక్టర్ రివీల్ తో పాటు.. రిలీజ్ డేట్, స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడంతో.. జక్కన్న ఇచ్చిన సర్ ప్రైజ్ లకు ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. త్రేతాయుగం, హనుమంతుడు, రాముడి ప్రస్తావన కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఎన్నడూ లేని రీతిలో రాజమౌళి ఒక సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ ను ఇలా ఒక ఈవెంట్ లో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. #GlobeTrotterగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా టైటిల్, మహేశ్ లుక్, క్యారెక్టర్ నేమ్, రిలీజ్ డేట్, స్పెషల్ వీడియో.. ఇలా ఐదు అప్ డేట్స్ ను ఒక ఈవెంట్లోనే అనౌన్స్ చేశారు.

Next Story