- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannappa: ఇద్దరు శక్తివంతమైన సింగర్స్ పాడిన స్పెషల్.. ‘కన్నప్ప’ నుంచి బిగ్ అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ ట్వీట్
మంచు విష్ణు డ్రీమ్(manchu vishnu) ప్రాజెక్ట్‌గా రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప’(Kannappa).

దిశ, సినిమా: మంచు విష్ణు డ్రీమ్(manchu vishnu) ప్రాజెక్ట్‌గా రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప’(Kannappa). అయితే ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్(Mohanlal), కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మంచి విష్ణు, మోహన్ బాబు(Mohan Babu) వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈనేపథ్యంలో.. ప్రమోషన్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, చిత్రబృందం ‘కన్నప్ప’ అప్డేట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పాట శ్రీకాళ హస్తి లిరికల్ వీడియో మే 28న రాబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పాటను మంచు విష్ణు కూతుళ్లు అరియానా(Ariana), వివియానా(Viviana Manchu) పవర్ ఫుల్ వాయిస్‌తో పాడినట్లు తెలిపారు. అంతేకాకుండా.. వీరిద్దరికి సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే వీరిద్దరు కూడా కన్నప్పలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మంచు విష్ణు తనయుడు అవ్రామ్ కూడా నటిస్తుండటం విశేషం.






