- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nithiin's 'Robin Hood': జాస్మిన్ బ్లౌజ్ & ఎనర్జిటిక్ డాన్స్.. అదిరిపోయిన్ ‘అది ధ సర్‌ప్రైజు’ సాంగ్
హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ సినిమా ‘రాబిన్‌హుడ్’

దిశ, సినిమా: హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ సినిమా ‘రాబిన్‌హుడ్’ (Robin Hood). వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేసి.. ప్రేక్షకులకు మ్యూజికల్ ట్రీట్‌ను అందించారు. అంతే కాకుండా.. జీవీ ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇందులో భాగంగా తాజాగా మూడో సాంగ్ ‘అది ధ సర్‌ప్రైజు’ (Adhi Dha Surprisu) విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్ (Special song)లో కేతికా శర్మ (Ketika Sharma) తన అద్భుతమైన జాస్మిన్ బ్లౌజ్ అండ్ ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్‌కు తన గ్లామర్‌ని జోడించి, పాటను విజువల్ ట్రీట్‌గా మార్చింది. సోషల్ మీడియాలో ఇన్స్‌స్టెంట్ హిట్‌గా నిలిచిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను డాన్స్ చేపించడం పక్కాగా కనిపిస్తుంది. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పాట వైబ్‌కి తగ్గట్టు మంచి ఎనర్జిటిక్‌గా ఉంది. దీంతో ‘అది ధ సర్‌ప్రైజు’ సాంగ్ డౌట్ లేకుండా ఈ సంవత్సరం మోస్ట్ హాటెస్ట్ సాంగ్స్‌లో ఒకటిగా తన స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా ఈ సాంగ్ లాస్ట్‌లో నితిన్ అండ్ శ్రీలీల కలిసి చేసిన డాన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






