రవితేజ ‘ఇరుముడి’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

శ్రీరామనవమి సందర్భంగా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది.

రవితేజ ‘ఇరుముడి’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: హిట్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి స్పెషల్‌గా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత రవితేజ తన 77వ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘ఇరుముడి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో తండ్రి పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ప్రేమ, ఆప్యాయతతో ముడిపడిన ఒక తండ్రి, ముచ్చటైన కూతురి కథ’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌లో రవితేజ తన కూతురుతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు చూపించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా, సాయి కుమార్, అజయ్ ఘోస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.


Next Story