- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kriti Sanon: బర్త్‌డే స్పెషల్.. సినిమా నుంచి హీరోయిన్ క్యూట్ లుక్ రిలీజ్
హీరోయిన్ కృతి సనన్.. మహేష్ బాబు ‘నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: హీరోయిన్ కృతి సనన్.. మహేష్ బాబు ‘నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆ అమ్మడు.. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేదు. ఇక లాస్ట్‌గా ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంతో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సినిమాలు తీస్తునే నిర్మాత కూడా మారి నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృతి ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో బిజీగా ఉంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుండగా.. ఈ ఏడాది నవంబర్ 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈరోజు కృతి బర్త్‌డే సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ.. ‘తేరే ఇష్క్ మే’ నుంచి కృతి క్యూట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బోల్డ్ అండ్ బ్యూటీ ఎగ్జైటింగ్ యాక్టింగ్ కలగలిపిన మిమ్మల్ని మాతో కలుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చాలా స్పెషల్ కాబట్టి.. మీకు స్పెషల్ లవ్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. హీరో ధనుష్, డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూడవ సినిమాపై అభిమానులతో పాటు ఆడియన్స్‌లో కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. లింక్






