- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: శ్రీలీల బికినీ ఫోటో వైరల్ !
శ్రీ లీలకు ఘోర అవమానం ఎదురయింది. శ్రీలీల బికినీలో ఉన్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 25 ఏళ్ల ఈ అందాల తార, 2019లో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కిస్ అనే కన్నడ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రీలీల, తెలుగులో 2021లో ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీ లీల, తన సెకండ్ సినిమాతో హిట్ అందుకుంది. అది కూడా మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమా కావడం విశేషం. ఆ తర్వాత హీరోయిన్ శ్రీలీల వరుసగా బడా హీరోల సరసన సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళ్తోంది. అంతేకాదు భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి బడా హీరోల సినిమాలో కూడా నటించి, అందరిని మెప్పించింది. ఈ సంక్రాంతి కానుకగా పరాశక్తి అనే సినిమాతో వచ్చేసింది హీరోయిన్ శ్రీలీల.
బికినీలో హీరోయిన్ శ్రీలీల ఫోటోలు ?
వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్న హీరోయిన్ శ్రీ లీలకు ఘోర అవమానం ఎదురయింది. ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కొంతమంది రెచ్చిపోతున్నారు. శ్రీలీల బికినీలో ఉన్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు. వాస్తవంగా హీరోయిన్ శ్రీలీల తెలుగుదనం ఉట్టిపడేలా, డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది. కానీ కొంత మంది పొట్టి బట్టలు వేసుకున్నట్లు ఫోటోలు క్రియేట్ చేసి, హీరోయిన్ శ్రీ లీలను ఆడుకుంటున్నారు. అయితే ఈ ఫోటోలు వైరల్ కావడంపై ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు కూడా హీరోయిన్ శ్రీ లీల ఫిర్యాదు చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి.






