- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Antony: చెప్పలేని ద్వేషముందే జగతిపై.. వైరల్‌గా ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ సాంగ్
మల్టీ టాలెంటెడ్‌గా ప్రేక్షకుల్లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని త్వరలో ‘మార్గన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్‌గా ప్రేక్షకుల్లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని త్వరలో ‘మార్గన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రాన్ని లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
జూన్ 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘సోల్ ఆఫ్ మార్గన్’ అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. ‘చెప్పలేని ద్వేషముందే జగతిపై’ అంటూ సాగే ఈ ‘సోల్ ఆఫ్ మార్గన్’ను చూస్తే సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్స్‌ను ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.






