త్వరలోనే 'బ్రో 2'... సముద్రఖని

by Pulgam srinivas |

సముద్రఖని మాట్లాడుతూ... 'బ్రో 2' చేయాలని తనకు ఎంతో ఆసక్తి ఉందని, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అని చెప్పుకొచ్చాడు.

త్వరలోనే బ్రో 2... సముద్రఖని
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'బ్రో' చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళ చిత్రం 'వినోదయ సీతం'కు రీమేక్‌గా రూపొందింది. తమిళ, తెలుగు రెండు వర్షన్‌లకూ సముద్రఖని దర్శకత్వం వహించారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పర్వాలేదనే స్థాయిలో ఆకట్టుకుంది.

తాజాగా సముద్రఖని ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా 'బ్రో' సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'బ్రో 2' చేయాలని తనకు ఎంతో ఆసక్తి ఉందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం, ఆయన ఒప్పుకుంటే వెంటనే సినిమా ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ ఓకే చెప్పడమే మిగిలి ఉందని, ఆయన అంగీకరిస్తే 'బ్రో 2' త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story