- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tribanadhari Barbarik Song : ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ నుంచి సాంగ్ విడుదల.. హైదరాబాదులోని ఆ కాలేజీలో
మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’.

దిశ, వెబ్‌డెస్క్: మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik). ఈ మూవీని వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సత్యం రాజేష్, సత్యరాజ్, సాచి రాయ్, వశిష్ట, ఎన్ సింహ, క్రాంతి కిరణ్, ఉదయ భాను వంటి తదితరులు కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించనున్నారు.
ఇకపోతే ఇప్పటికే ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం నుంచి విడుదల అయిన సాంగ్స్, గ్లింప్స్ మూవీపై భారీ హైప్ పెంచాయి. జనాలు ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోన ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ఓ ఫీల్ గుడ్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అనగా అనగా కథలా అంటూ సాగే ఈ సాంగ్‌ను టీకేఆర్ కళాశాలలో స్టూడెంట్స్ సమక్షంలో చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఈ సాంగ్ మనవరాలి తాత బంధంతో కొనసాగుతోందని అర్థం అవుతోంది. ఇక ఇంప్యూజన్ బ్యాండ్ అందిస్తున్నారు. సనరే ఈ సాంగ్ సంగీతాన్ని సమకూర్చగా.. కార్తిక్ అనగా అనగా కథలా సాంగ్ పాడారు. ఈ పాట కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడాు. ఏకంగా14 వేల మంది స్టూడెంట్స్ మధ్య ఈ సాంగ్ విడుదల చేశామని చెప్పారు.
కాగా చాలా సంతోషంగా అనిపిస్తుందని వెల్లడించారు. ఇక కాలేజీ పిల్లల ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే ముచ్చటగా ఉందని వెల్లడించారు. అలాగే దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. సత్య రాజ్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉందని.. ప్రొడ్యూసర్ విజయ్ పాల్ రెడ్డి అడిదాల టీకేఆర్ కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) కాలేజీలో పాట కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.






