- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది భూత్ని’ సినిమా నుంచి రంగ్‌లగా సాంగ్ రిలీజ్.. ఊహించని లుక్‌లో దర్శనమిచ్చిన మౌనిరాయ్
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Dutt) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది భూత్నీ’ (The Bhootnii).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Dutt) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది భూత్నీ’ (The Bhootnii). దీనిని కొత్త డైరెక్టర్ సిధాంత్ సచ్‌దేవ్(Sidhanth Sachdev) తెరకెక్కిస్తుండగా.. సోహమ్ రాక్‌స్టార్(Soham Rockstar) ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ త్రీ డైమెన్షన్ హోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మౌని రాయ్(Mouni Roy), పాలక్ తివారీ, సన్నీ సింగ్(Sunny Singh), బయోనిక్, ఆసిఫ్ ఖాన్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హారర్ యాక్షన్ అండ్ కామెడీ చిత్రంగా రాబోతోంది.
అయితే ఈ సినిమా ఏప్రిల్ 18 విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ పూర్తి అయినప్పటికీ వీఎఫ్‌ఎక్స్ పని పూర్తి కానందున వాయిదా పడింది. ‘ది భూత్నీ’ 2025 మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన లవ్ సాంగ్ విడుదలైంది. ఇక ఇందులో మౌని రాయ్, సన్నీ సింగ్, వైష్ణవి మెస్మరైజ్ చేశారు. హీరో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించిన విషయాన్ని వారు తెలుసుకొని చివరకు దెయ్యాలుగా మారిపోతారు. ఈ పాటకు ‘‘మునుపెన్నడూ లేని ప్రేమ - తీవ్రమైన, నిర్భయమైన, మరపురానిదిగా ఉంటుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు.






