తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ పెళ్లి.. అప్పగింతలు.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. AR సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా

తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ పెళ్లి.. అప్పగింతలు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. AR సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్. సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీతో రూపొందుతున్న మూవీని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుండగా... కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మంచి బజ్ క్రియేట్ చేసింది. కాగా ప్రస్తుతం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘సిన్నారి కోన’ రిలీజ్ చేసి మ్యూజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. అప్పగింతలు బ్యాక్ డ్రాప్‌లో కంపోజర్ జయ కృష్ణ బ్యూటీఫుల్ మెలోడీ అందించారు. జయ కృష్ణ, అనన్య భట్, ఎం.జి. నరసింహ వోకల్స్ పాటకు ఫీల్‌ తీసుకొచ్చాయి. భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది.

Next Story