బోర్డర్ 2 ప్రాజెక్ట్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బోర్డర్-2’.

బోర్డర్ 2 ప్రాజెక్ట్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బోర్డర్-2’. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేధా రానా హీరోయిన్‌గా నటిస్తుండగా.. సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్, నితీష్ నిర్మల్, అహన్ శెట్టి, వినాలి భట్నాగర్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తాజాగా మరో బ్యూటీ భాగం అయినట్లు తెలుస్తుంది.

ఇందులో బాలీవుడ్ నటి సోనమ్ బజ్వాను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట మేకర్స్. అంతే కాకుండా తాజాగా ఈ బ్యూటీ షూటింగ్‌లో అడుగుపెట్టినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అలాగే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. కాగా.. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జవనరి 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం కాబోతుంది. దీనిని జెపి ఫిల్మ్స్, టి సిరీస్ బ్యానర్స్‌పై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, జెపి దత్తా, నిధి దత్తా నిర్మిస్తున్నారు. లింక్


Next Story