Sonal Chauhan: గోల్డెన్ సారీలో గ్లామర్ మెరుపులు

by Pulgam srinivas |

గోల్డెన్ సారీలో ఆకట్టుకునే అందంతో మెరిసిపోతున్న సోనాల్ చౌహాన్.

Sonal Chauhan: గోల్డెన్ సారీలో గ్లామర్ మెరుపులు
X

దిశ, వెబ్ డెస్క్: సోనాల్ చౌహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ బాలీవుడ్ చిత్రం ‘జన్నత్’ ద్వారా వెండితెరకు పరిచయం అయింది. అనంతరం ‘రెయిన్‌బో’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.




దీంతో కొన్ని సంవత్సరాల పాటు సోనాల్ చౌహన్ తెలుగు సినీ పరిశ్రమ వైపు చూడలేదు. తరువాత 2014లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజెండ్’ చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత సోనాల్ చౌహన్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.




ముఖ్యంగా బాలయ్య సినిమాలతో ఈమెకు మంచి విజయాలు దక్కాయి. చివరిగా ఈమె తెలుగులో ‘ఎఫ్ 3’ చిత్రంలో కనిపించింది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ భాషలోనూ కొత్త సినిమాలు చేయలేదు. ఇప్పటివరకు సోనాల్ తన నటనతో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.




సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అభిమానులను అలరిస్తోంది. దీంతో ఈమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.




అందులో సోనాల్ గోల్డ్ కలర్‌లో హెవీ వర్క్ ఉన్న చీరను ధరించి, పింక్ స్టోన్ వర్క్ ఉన్న స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌లో మెరిసింది. మెడను హత్తుకునే భారీ నెక్లెస్‌తో పాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించి స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంది. అలాగే స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో తన నడుము, ఎద అందాలను హైలైట్ చేస్తూ ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story