Nikhita Roy: రిలీజ్‌కు సిద్ధమైన సోనాక్షి సైకలాజికల్ థ్రిల్లర్.. పోస్టర్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2025-04-19 13:45:46  IST  )

వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ బాలీవుడ్‌(Bollywood)లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను సొంతం చేసుకుంది సోనాక్షి సిన్హా

Nikhita Roy: రిలీజ్‌కు సిద్ధమైన సోనాక్షి సైకలాజికల్ థ్రిల్లర్.. పోస్టర్ వైరల్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ బాలీవుడ్‌(Bollywood)లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను సొంతం చేసుకుంది సోనాక్షి సిన్హా (Sonakshi Sinha). ఈ క్రమంలోనే త్వరలో ‘నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ (Nikita Roy and the Book of Darkness) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. సోనాక్షి సిన్హా సోదరుడు ఖుష్ సిన్హా (Khush Sinha) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ (Psychological thriller) చిత్రాన్ని పవన్ కిర్పలానీ రచించగా.. దీనికి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చారు చిత్రం బృందం. ‘నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ సినిమా ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా మే 30 న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Next Story