- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాద్షా పాటపై సోనా మోహపాత్ర ఫైర్.. స్త్రీలను కించపరచడం క్రియేటివిటీ కాదని కౌంటర్
రాపర్ బాద్షా కొత్త పాట ‘తతీరీ’ వివాదంలో చిక్కుకుంది. మహిళలను కించపరిచేలా ఉన్న ఈ పాటపై సింగర్ సోనా మోహపాత్ర తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ రాపర్ బాద్షా తాజాగా విడుదల చేసిన ‘తతీరీ’ (Tateeree) అనే హర్యాన్వీ పాట తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పాటలో మహిళలను కించపరిచే విధంగా ఉన్న సాహిత్యం, దృశ్యాలపై ప్రముఖ సింగర్ సోనా మోహపాత్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది కేవలం బాద్షా ఒక్కడి సమస్యే కాదని, పాప్ సంస్కృతిలో మహిళలను ఒక వస్తువులా చూపించడం (Objectifying women) ఒక అలవాటుగా మారిందని ఆమె ధ్వజమెత్తారు.
కాగా, మార్చి 1న విడుదలైన ఈ పాటపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హర్యానా సంస్కృతిని తప్పుగా చిత్రీకరించారనే ఆరోపణలొచ్చాయి. దీనిపై హర్యానా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తీవ్ర ఒత్తిడి, విమర్శల నేపథ్యంలో బాద్షా బహిరంగ క్షమాపణలు చెప్పి, ఆ పాటను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు.
సోనా మోహపాత్ర ఘాటు వ్యాఖ్యలు..
బాద్షా క్షమాపణలు చెప్పినప్పటికీ, సోనా మోహపాత్ర తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అతడిని ఏకిపారేసింది. ‘మగతనాన్ని ప్రదర్శిస్తూ, మహిళలు కేవలం తన చుట్టూ తిరిగే బొమ్మల్లా చూపించడం క్రియేటివిటీ అనిపించుకోదు. ఇది అత్యంత చౌకబారు పద్ధతి. కళాకారులు సమాజంపై బాధ్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా మహిళల భద్రత, గౌరవం విషయంలో హర్యానా లాంటి రాష్ట్రాల నేపథ్యాన్ని వాడుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సోనా మోహపాత్ర హితవు పలికారు.






