తండ్రి, కొడుకుల మధ్య బంధమే.. సన్ ఆఫ్..

by Sujitha Rachapalli |

సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ... నిర్మించిన చిత్రం "S/O"(సన్ ఆఫ్). బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. కాగా ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో..

తండ్రి, కొడుకుల మధ్య బంధమే.. సన్ ఆఫ్..
X

దిశ, సినిమా : సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ... నిర్మించిన చిత్రం "S/O"(సన్ ఆఫ్). బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. కాగా ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో.. ‘‘ఎప్పటి నుంచో ఇలాంటి కథను తెరమీద చూపించాలని వుంది. ఈ కథ రియల్ లైఫ్‌లో నాకూ, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది. చాలా కథలు విన్నాను. చివరకు ఈ కథకి కనెక్ట్ అయ్యాను. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ఇందులో డ్రామా, ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రతి కొడుకు... తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం. దర్శకుడు ఏమి చెప్పారో అదే టీజర్‌లో చూపించారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఈ చిత్రానికి ఎంతో వెన్నుదన్నుగా నిలిచి కంప్లీట్ చేశారు. నేను చిరంజీవి గారికి డైహార్ట్ ఫ్యాన్‌ని. ఈ సినిమాను ఆయనకి చూపించాలని వుంది’’ అని తెలిపారు. నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ... ‘‘సన్ ఆఫ్ మూవీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు.. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. రెగ్యులర్ లైఫ్‌లో ఓ తండ్రి, కొడుకుల మధ్య సాగే స్టోరీ ఇది. దర్శకుడు సతీష్ 45 నిమిషాలు స్టోరీ అద్భుతంగా నెరేషన్ చేశారు. వందకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో చెబుతున్నా... దర్శకుడు జీనియస్’ అని ప్రశంసలు కురిపించాడు.

Next Story