Vijay Dalapathy: సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరో కొడుకు ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ (వీడియో)

by Chukka Sudharani |   (  Updated:2025-08-28 10:48:30  IST  )

తమిళ స్టార్ దళపతి విజయ్(Vijay Dalapathy) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Vijay Dalapathy: సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరో కొడుకు ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ (వీడియో)
X

దిశ, సినిమా: తమిళ స్టార్ దళపతి విజయ్(Vijay Dalapathy) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజెంట్ ఈయన రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. తన లాస్ట్ చిత్రం ‘విజయ్ 69’(Vijay 69)తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా అనంతరం విజయ్ మూవీస్‌కు దూరం అవుతాడని తెలియడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే విజయ్ వారసుడు ఇండస్ట్రీ ఎంటీ అభిమానుల్లో సరికొత్త ఎనర్జీని నింపింది. అయితే.. విజయ్ దళపతి కొడుకు జాన్సన్ సంజయ్(Johnson Sanjay) ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేది హీరోగా కాదు డైరెక్టర్‌గా. అవును మీరు విన్నది నిజమే.. జాన్సన్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. తన మొదటి సినిమా యంగ్ హీరో సందీప్ కిషన్‌(Sandeep Kishan)తో చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్ ప్రజెంట్ చేయగా.. తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ప్రజెంట్ ఈ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.

Video Link..

Next Story