- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా ఓటు వేరొకరు వేశారు’.. ఎక్స్‌లో ఎన్నికల సంఘానికి నటి ఫిర్యాదు
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన నటి అక్షయ హరిహరన్‌కు పోలింగ్ కేంద్రంలో చేదు అనుభవం ఎదురైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన నటి అక్షయ హరిహరన్‌కు పోలింగ్ కేంద్రంలో చేదు అనుభవం ఎదురైంది. తన ఓటును అప్పటికే మరెవరో వేశారంటూ ఆమె ఎన్నికల సంఘానికి (ECI) ఎక్స్ @akshaya__31 (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేశారు. అడయార్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన అక్షయకు.. అప్పటికే ఆమె పేరుతో వేరొకరు (వేలిముద్ర ఉపయోగించి) ఓటు వేశారని సిబ్బంది తెలపడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన వద్ద ఉన్న అన్ని గుర్తింపు కార్డులు (ఐడీలు) చూపించి, తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరినా సిబ్బంది అంగీకరించలేదని ఆమె ఓ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
నటి డిమాండ్ ఇదే..
తనలాగే ఇంకెంత మంది దొంగ ఓట్లు వేసి ఉంటారోనని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. తన ఓటును వెంటనే రద్దు చేయాలని, తన స్థానంలో ఓటు వేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్న నెటిజన్లు.. అధికారికంగా ఫిర్యాదు చేయాలని, అలాగే ఎన్నికల నిబంధనావళి లోని సెక్షన్ 49P (టెండర్డ్ ఓటు) కింద ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు. కాగా, తమిళనాడు, బెంగాల్‌లో పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 82.24 శాతం పోలింగ్ నమోదు అవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్‌లో 90 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు.






