Rana Naidu-2: కొన్ని యుద్ధాలు కొనసాగుతాయి.. కొత్తవి స్టార్ట్.. క్యూరియాసిటీ పెంచిన ‘రానా నాయుడు-2’ అప్డేట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-26 15:44:37  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’(Rana Naidu).

Rana Naidu-2: కొన్ని యుద్ధాలు కొనసాగుతాయి.. కొత్తవి స్టార్ట్.. క్యూరియాసిటీ పెంచిన ‘రానా నాయుడు-2’ అప్డేట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’(Rana Naidu). అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయి రికార్డ్ వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో వెంకీ, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. అయితే ఎంత ‘రానా నాయుడు’ సిరీస్ ఎంత పాపులారిటీ తెచ్చుకుందో అంతే రేంజ్‌లో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇందులోని పలు సీన్స్ మరీ బోల్డ్‌గా ఉన్నాయంటూ కొంతమంది దారుణంగా ట్రోల్ చేశారు.

అయినప్పటికీ ‘రానా నాయుడు’ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపింది. అయితే సినీ ప్రియులంతా ఈ సిరీస్‌కు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయట్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ సీజన్-2 రాబోతున్నట్లు వెల్లడించడంతో అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ‘రానా నాయుడు-2’ కు సంబంధించిన అప్డేట్‌ను మాత్రం ఇవ్వకపోవడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ సినీ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘రానా నాయుడు-2’ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో విలన్‌గా నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) నటిస్తుండగా.. కరణ్ అన్షుమన్(Karan Anshuman) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇందులో మధ్యలో ‘కొన్ని యుద్ధాలు కొనసాగుతాయి.. కొత్తవి ప్రారంభమవుతాయి’’ అని ఇచ్చి మేకర్స్ ‘రానా నాయుడు-2’ హైప్ పెంచారు. ఇక అది చూసిన వారు తొందరగా స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Video Link..

Next Story