- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా కన్నీళ్లను కూడా క్యాష్ చేసుకుంటున్నారు.. సుప్రీత
.అమరావతికి ఆహ్వానం ఈవెంట్లో సుప్రీత మాట్లాడుతూ.. గతంలో మాపై తప్పుడు వార్తలు రాసి మేము బాధపడుతుంటే వాటిని క్యాష్ చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత తాజాగా అమరావతికి ఆహ్వానం అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అందులో సుప్రీత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. తాజాగా సుప్రీత మాట్లాడుతూ... కొంతమంది మాపై లేనిపోని తప్పుడు కథనాలు రాసి మేము బాధపడుతుంటే మా కన్నీటిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు.
మాపై అనేక తప్పుడు వార్తలను రాయడంతో ఆ బాధను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఏ నెగెటివిటీనైనా తట్టుకునే ధైర్యం నాకుంది. గతంలో నేను కొన్ని బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేశాను. కానీ అవి సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమోషన్స్ అని నాకు అప్పుడు అస్సలు తెలియదు. నేను తెలియకుండా తప్పు చేశాను. అది కేవలం తెలియక చేసిన పొరపాటు మాత్రమే, ఇప్పుడు ఏ ప్రమోషన్ చేయాలన్నా మొదట లాయర్ను సంప్రదించి అంతా ఓకేగా ఉంది అనుకుంటేనే దానిని ప్రమోట్ చేస్తున్నాను అని సుప్రీత తెలియజేసింది.
తన తల్లి సురేఖ వాణి రెండవ పెళ్లి గురించి సుప్రీత స్పందిస్తూ... "మా అమ్మ రెండవ పెళ్లి చేసుకోవాలి అనేది పూర్తిగా నా కోరిక. ఆమెకు ఎప్పుడూ కూడా మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన లేదు" అని చెప్పుకొచ్చింది. తాజాగా అమరావతి ఆహ్వానం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సుప్రీత ప్రస్తుతం బిగ్బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరోగా రూపొందుతున్న చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.






