‘RC-16’ నుంచి సాలిడ్ అప్డేట్.. కరునాడ చక్రవర్తిగా స్టార్ హీరో.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-06 12:30:56  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నారు.

‘RC-16’ నుంచి సాలిడ్ అప్డేట్.. కరునాడ చక్రవర్తిగా స్టార్ హీరో.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన ‘గేమ్ చేంజర్’ (Game Changer)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించగా.. భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘RC-16’ మూవీ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది.

దీనికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇందులో జగపతి బాబు(Jagapathi Babu), మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. శివన్న లుక్ టెస్ట్‌‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆయన కరునాడ చక్రవర్తి పాత్రలో కనిపిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా త్వరలోనే ఆయన షూట్‌లో జాయిన్ కానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. అలాగే జమా మసీదు వద్ద కూడా కొన్ని సీన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Next Story