పవన్ కల్యాణ్ ‘OG’ నుంచి సాలిడ్ అప్డేట్.. రికార్డులు బద్దలవ్వడం ఖాయం!

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ(OG Movie).

పవన్ కల్యాణ్ ‘OG’ నుంచి సాలిడ్ అప్డేట్.. రికార్డులు బద్దలవ్వడం ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ(OG Movie). ఈ సినిమా‌ను యంగ్ డైరెక్టర్ సుజిత్(Sujith) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్, పవన్ కల్యాణ్ పోస్టర్లు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. మరోవైపు.. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడిందని.. అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు ఓజీతో తాము సమాధానం చెబుతామని ఫ్యాన్స్‌ రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాంచి ఆకలి మీదున్న పవన్ అభిమానులకు భారీ ఊరట కలిగించేలా ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓజీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీక్‌లోనే ప్రోమో రిలీజ్ చేసి.. ఆగష్టు 3వ తేదీన మొత్తం సాంగ్‌కు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తమిళ నటుడు శింబు పాడిన టైటిల్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామంటూ నెట్టింట్ల కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Next Story