Akhanda 2 : ‘అఖండ-2’ నుంచి సాలిడ్ అప్‌డేట్..టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-09 07:08:10  IST  )

బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న చిత్రం ‘అఖండ-2’(Akhanda-2).

Akhanda 2 : ‘అఖండ-2’ నుంచి సాలిడ్ అప్‌డేట్..టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న చిత్రం ‘అఖండ-2’(Akhanda-2). ఇది హిట్ మూవీ ‘అఖండ’(Akhanda)కు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసింది. ఇక దీన్ని 14రీల్స్ బ్యానర్ పై రామ్‌ ఆచంట(Ram Achanta), గోపీచంద్‌ ఆచంట(Gopichand Achanta) నిర్మిస్తుండగా.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని(Tejaswini) సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. అయితే ఇందులో బాలయ్య సరసన హీరోయిన్‌గా సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

అయితే రేపు బాలకృష్ణ బర్త్‌డే కావడంతో ఈ మూవీ నుంచి తాజాగా సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘దైవిక ఉగ్రతకు సిద్ధంగా ఉండండి.. రేపటి నుంచి టీజర్ తాండవం స్టార్ట్ కానుంది.. అఖండ-2 టీజర్ జూన్ 9న సాయంత్రం 6.03 గంటలకు విడుదల కానుంది’ అని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా నంది, ఢమరుకంతో కూడిన త్రిశూలాన్ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Next Story